Ugadi telugu greetings wishes information in telugu pdf
ప్రకృతిలోని అందాలను... సున్నితమైన భావాలను...
అందమైన మనస్సుని.. రాబోయే క్రొత్త సంవత్సరంలోనే కాకుండా
జీవితాంతం ఆస్వాదిస్తూ.. ఆనందిస్తూ.. ఉండాలని కోరుకుంటూ...
‘వసంతలక్ష్మి’కి స్వాగత సత్కారమే ఉగాది.....
ఉగాది- వసంతానికి గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల రుతువులకు ప్రాతఃస్సాయంకాలాది త్రికాలాలో ఉషా దేవత మా తృస్వరూపమని వివరిస్తున్న సూర్యరశ్మికున్న ప్రయోజనాన్ని అంగ పురాణం చెపుతోంది.
భాస్కరాచార్యుడు తన ‘సిద్ధాంత శిరోమణి’ అనే జ్యోతిష గ్రంథంలో లంకా నగరంలో సూర్యుడు ఉదయించడం వల్ల మధుమాసం ‘యుగాది’ అయ్యింది.
రావణాసుర వధ అనంతరం శ్రీరాముడు సీతతో కూడి అయోధ్యకు ఈ ఉగాది రోజునే బయలుదేరినట్టు వివరణ ఉంది.
వసురాజు తీవ్రమైన తపస్సు చేసి రాజ్యాన్ని పొందినపుడు ఇంద్రుడు అతనికి నూతన వస్త్రాలు బహుకరించింది ఉగాది నాడే.
వేదాలను దొంగలించిన సోమకుని వధించిన మత్స్యావతార ధారియై వేదాలు బ్రహ్మకు అప్పగించింది ఉగాది నాడే.
సూర్య కిరణాల ప్రభావంతో వివిధ రుతువులలో ప్రకృతి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది. గ్రీష్మ రుతువులో అధిక వేడి, వర్ష రుతువులో వర్షాల వల్ల కర్షకులు కృషీవలురవుతారు. భూభాగం ఒత్తిడిగా మారి అంటురోగాలకు అవకాశం ఉంది.
శరత్, హేమంతాల వెన్నెలను, చలిని కలిగిస్తాయి. ప్రేమికులకు విరహాన్ని కలుగ చేసి ఎండమావి వలె ఆశలు రేకెత్తించి వెళ్ళిపోతుంది. రాజులు ఈ కాలాన్ని యుద్ధానికి వాడుకునేవారు.
శిశిరంలో ప్రకృతి బోసిపోయినట్లుగా ఆకులన్నీ రాలి మోడులు మిగులుతాయి.
ఇక సూర్యకిరణ ప్రభావితమైన వసంతం పసుపు, గోధుమ వర్ణంలో ఉంటుంది. ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. దక్షిణాయణంలో క్షీణత చెందుతాయి.
వసంతానికి ఇతిహాసపరంగా, వైద్య పరంగా, శోభ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వసంతాన్ని రుతురాణిగా అభివర్ణించారు. ‘మామిడి పిందెలతో నిండిన చెట్లు, వేప పూతతో విరబూసిన వృక్షాలు, కోకిలమ్మల కూజితాలు ఈ పండుగ ప్రత్యేకం. చెట్లన్నీ ఆకులు రాల్చి, చిగుర్చి కళకళలాడుతూ ఉంటాయి.
శిశిరంలో ఎండి మోడువారిన చెట్లన్నీ వసంత రుతువు ఆగమనంలో సన్న జాజుల, మల్లెల పరిమళాలతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతటి ప్రకృతి శోభను సంతరించుకుంటుందన్న మాట. మానవులు అనేక రుగ్మతలతో బాధలతో కృశించే సమయంలో వినూత్న మార్పుల్ని, జాగృతినీ కలిగిస్తుంది వసంత ఆగమనం.
వైద్యపరంగా వసంతం: వసంతంలో వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది. ఏ మాలిన్యమూ లేని వేడినీటిలో రోజుకు ఐదుసార్లు స్నానం చేస్తే ఈ వేసివి రోగాలు దరిచేరవుట.
వసంత నవరాత్రులు ఆరోగ్యరీత్యా కూడా శుభకరమైన రోజులు. ‘ఆనంద సాగరమనే వైద్య శాస్త్ర గ్రంథం’లో వసంత రుతువులో కోకిల కంఠస్వరం వింటే కొన్ని రకాలైన రుగ్మతలు తొలిగిపోతాయని పేర్కొన్నారు.
శుశ్రుత వైద్య గ్రంథంలో, వసంతరుతువులో వేప పువ్వు తగు మోతాదులో తీసుకుంటే క్షయరోగాన్ని అరికట్టవచ్చని చెప్పబడింది. ప్రపంచంలో ఎక్కువ పుష్పాలు వికసించేది వసంతంలోనే ఈ పుష్ప సుగంధాలు ప్రకృతికి ఉన్న అమృతత్వాన్ని ఎక్కువ చేసి ఎన్నో రోగాలు తగ్గేందుకు తోడ్పడుతుంది.
|Ugadi sms in telugu greetings quotes|
కష్టాలెన్నైనా సరే రానీండి...
సవళ్ళెన్నానా సరే ఎదురవనీ...
కలిసి నడుద్దాం.. కలబడదాం.. గెలుద్దాం..
ఈ సంవత్సరం మీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
సవళ్ళెన్నానా సరే ఎదురవనీ...
కలిసి నడుద్దాం.. కలబడదాం.. గెలుద్దాం..
ఈ సంవత్సరం మీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ...
క్రొత్త ఆశలకు ఊపిరిపోస్తూ...
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
ప్రకృతిలోని అందాలను... సున్నితమైన భావాలను...
అందమైన మనస్సుని.. రాబోయే క్రొత్త సంవత్సరంలోనే కాకుండా
జీవితాంతం ఆస్వాదిస్తూ.. ఆనందిస్తూ.. ఉండాలని కోరుకుంటూ...
ఈ నూతన సంవత్సరం
మీకు ఆనందాలు సంతోషాలు
తీసుకురావాలని అవి జీవితమంతా
కొనసాగాలని ఆశిస్తూ...!!
Post a Comment