Friday, 15 April 2022

Sri Hanuman Janma Dinotsava Hanuman Jayanthi greetings wishes images in telugu pdf free download - హనుమత్ జయంతి శుభాకాంక్షలు

Hanuman Janmotsav 2022 : 
హనుమాన్ జన్మోత్సవం కోసం హనుమాన్ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చైత్ర మాసం పౌర్ణమిని ఆంజనేయ స్వామి వారి జన్మదినంగా జరుపుకుంటారు. తిథుల ప్రకారం ఈ సంవత్సరం హనుమాన్ జన్మోత్సవం 16 ఏప్రిల్ 2022న వస్తుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు హనుమాన్ భక్తులు ఉపవాసం ఉంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజా క్రతువులు నిర్వహించి హనుమాన్‌ను ప్రసన్నం చేసుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది హనుమాన్ జన్మోత్సవాన్ని హనుమాన్ జయంతిగా పిలుస్తున్నారు. కానీ అది సరికాదు.

Don't call it as Hanumat Jayanthi - Call only Hanuman Janma Dinotsav or Hanuman Janmotsav

ఇది 'జయంతి' కాదు 'జన్మోత్సవం' అని చెప్పండి :



సాధారణంగా 'జయంతి' అనే పదాన్ని పరమపదించిన వ్యక్తుల పుట్టినరోజును తెలిపేందుకు వాడుతారు. దైవానికి సంబంధించిన వేడుకలకు జయంతి అనే పదం వాడరాదు. కాబట్టి హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలవడం సరైనది. ఇప్పటికీ చాలామంది 'హనుమాన్ జయంతి' అనే పదాన్నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిజమైన ఆంజనేయ భక్తులు హనుమాన్ జన్మోత్సవంగా దీన్ని పిలవాలని గ్రహించాలి.


|Hanuman Janmotsav Greetings wishes images in telugu free download |

జన్మోత్సవ్ అనే పదం అమరత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ దైవానికి సంబంధించిన వేడుకలకు ఆ పదమే సరైనది. ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు 'హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు' అని చెప్పాలి. అంతేకానీ 'హనుమాన్ జయంతి శుభాకాంక్షలు' అని చెప్పవద్దు.

Read Hanuman Chalisa on Hanuman Janmotsav ::: హనుమాన్ చాలీసా పఠించండి : హనుమాన్ జన్మోత్సవం రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే దైవ అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. లేదా ఇంట్లో హనుమాన్ చిత్రపటం ముందు శ్రద్ధంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
Read Hanuman Chalisa on Hanuman Janmotsav :::
 హనుమాన్ చాలీసా పఠించండి : హనుమాన్ జన్మోత్సవం రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే దైవ అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. లేదా ఇంట్లో హనుమాన్ చిత్రపటం ముందు శ్రద్ధంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only