Saturday 2 April 2022

Ugadi Panchangam ugadi science Ugadi history Ugadi Greetings Ugadi wishes Ugadi images pdf free download

Significance of Ugadi Calendar ఉగాది అంటే మన కేలండర్ ఈ రోజు నుండే ప్రారంభమవుతుందన్న మాట... వాస్తవంగా ఇప్పుడు ఆంగ్ల సంవత్సరాది తో ప్రారంభమయ్యే కేలండర్ ను వదిలేసి.. మన హిందూ కేలండర్ ను అనుసరించే కేలండర్ లు రావడం అప్పుడే మొదలైంది... మున్ముందు మనం ఖచ్చితంగా New year అంటే ఉగాదే అనే విషయం అప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది...

భారతీయ కాలమానం(చాంద్రమానం - చంద్రుని గతి ద్వారా లెక్కగట్టే కాలమానం) ప్రకారం, చంద్రుడు కనిపించని రోజుతో (అమావాస్య) నెల పూర్తవుతుంది. మళ్ళీ కొత్త నెల చంద్రోదయం(పాడ్యమి)తో ప్రారంభమవుతుంది. పన్నెండు నెలలకు గానూ పన్నెండు సార్లు అమావాస్య (No moon day) వస్తుంది. పన్నెండు నెలలూ ప్రారంభం కావడం చంద్రోదయం(పాడ్యమి) తోనే ప్రారంభమవుతాయి. ఈ కాలమానమంతా ఖగోళ విజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.

ఆంగ్ల కాలమానం ఖగోళంలో వేటి పై ఆధారపడి నడుస్తుందంటే వారి వద్ద సమాధానం ఉండదు. ఒక వేళ ప్రళయం వచ్చి సమస్తమూ నాశనమయ్యి సూర్య చంద్రులతో సహా సృష్టి మళ్ళీ మొదలైనపుడు కూడా, వేదవేదాంగాల వల్ల మళ్ళీ భారతీయ కాలమానం యథాతథంగా మొదలవుతుంది. అంటే సూర్యచంద్రులుంటే ఈ కాలమూనమూ ఉంటుంది, ఈ ధర్మమూ ఉంటుంది. ఇంగ్లీషు కాలమానానికి ఆ అవకాశం లేదు. ఎందుకు లేదంటే అది మానవ కల్పిత క్యాలెండర్ కాబట్టి, చేతిలో క్యాలెండర్ లేకపోతే డేట్ నిర్ణయించడం కుదరదు.



కాబట్టి ప్రళయం తర్వాత కూడా నిలబడేది సనాతన ధర్మమేనని గ్రహించండి.


ఇంకొక విషయం - భారతీయ కాలమానాన్ని ఎవ్వరూ మార్చడానికి అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడమే. కానీ ఇంగ్లీషు కాలమానం, ఒక రాజు వచ్చి క్యాలెండర్లోంచి ఒక రోజు పీకేస్తే ఇంకొక రాజు వచ్చి ఒక రోజు అదనంగా చేరుస్తాడు. అది ఎవడిష్టానికి వాడు మార్చుకున్న కాలమానం. మనది పూర్తిగా సృష్టి మీద ఆధారపడి నడిచే కాలమానం.


కొసమెరుపు - అమావాస్యని వాళ్ళు (No moon day) చంద్రుడు లేని రోజుగా వ్యవహరిస్తారు. అంటే ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఆ రోజు చంద్రుడు మాయమవుతాడని భావించే వారన్నమాట. మనవాళ్ళెప్పుడూ అలా వ్యవహరించలేదు సుమా! మహాభారతంలో యుద్ధానికి ముందు, సూర్యచంద్రులు కలిసే రోజే అమావాస్య కదా అని కృష్ణుడంటాడు. ఐనా మన కుహనా మేధావులకు పాశ్చాత్య విజ్ఞానమే విజ్ఞానం.
Tags:
Ugadi Quotes
Ugadi telugu wishes
Shubhakruth Nama samvatsara ugadi shubhakankshalu
శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
Ugadi wishes images free download

Post a Comment

Whatsapp Button works on Mobile Device only