Inspirational life story:: Lessons lerned from life:: Read completely
మనం సీతాకోకచిలుకను మాత్రమే చూస్తాం... కానీ ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక గా మారటానికి ఎంత శ్రమిస్తుందో చాలా మందికి తెలియదు... దాని మీద చిన్న కథ...
ప్రణయ్ ఆ రోజు నిత్య కృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ తన పని లో నిమగ్నమై ఉన్నాడు.. ఎందుకో ఒక్కసారిగా అతని కళ్లముందు గూడునుండి బయటకు రావటానికి ప్రయత్నిస్తున్న ఒక సీతాకోక చిలుక కనపడింది.. అప్పుడు దాదాపు95% గూడు ఉండి కేవలం కొద్ది ప్రదేశం మాత్రమే తెరువబడి ఉంది... ప్రణయ్ చాలా ఉత్సుకతతో చూస్తున్నాడు.. ఆ సీతా కోక చిలుకా చాలా సేపు ప్రయత్నిస్తూనే ఉంది...ఒక గంట సేపటి తర్వాత మరికొంచెం గూడు తెరుచుకుంది....
ప్రణయ్ ఇలా తన పని చేసుకుంటూ ఆ గూడు వంక మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాడు... రెండు గంటల తర్వాత దాదాపు నలభై శాతం గూడు తెరుచుకుంది... ఆ సీతాకోక చిలుక ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది... ఈ సారి ప్రణయ్ దానికి సాయ పడదామనుకున్నాడు... తన దగ్గర ఉన్న బ్లేడ్ తో జాగ్రత్తగా గూడును కట్ చేసి ఆ సీతాకోక చిలుకకు సాయపడ్డాడు...
ఇప్పుడు అది గూడు నుండి బయటకు వచ్చి ఎగురటానికి ప్రయత్నించింది.. సాధ్యంకాలేదు.. ఎంతకీ దాని కుడి రెక్క తెరుచుకోవడం లేదు... ఇలా చాలా సార్లు ప్రయత్నించింది... కానీ సాధ్యపడటం లేదు... చివరకు అది చనిపోయింది..
ప్రణయ్ కు అర్థం కాలేది తాను చేసింది మంచి పనా ?? లేక చెడ్డ పనా???
వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే సీతాకోక చిలుక తనంతట తాను ఎగురగలిగే శక్తి వచ్చేంత వరకు ఆ గూడు ను తెరచి బయటకు రాలేదు... ఆ గూడులోనే ఉన్న ఆహారాన్ని ఉపయోగించుకుని తిరిగి శక్తిని కూడగట్టుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది.. అలా దానికి కావలసిన శక్తి రాగానే అది వెంటనే ఎగిరిపోగలుగుతుంది... కానీ ఇక్కడ ప్రణయ్ చేసిన ప్రకృతి విరుద్ధమైన పని... దాని వలన ఆ జీవానికి మేలు జరుగక పోగా కీడే జరిగింది...
మన నిజజీవితంలో మనకు వచ్చే కష్టాలు కూడా అంతే.. మనకు ఎదురయ్యే పరిస్థితులు/పరీక్షలు మనం మన భవిష్యత్ ను ఎదుర్కోవడానికే.. ఆ కష్ట సమయాన్ని ఎదుర్కొంటేనే పట్టు పురుగు అయినా సీతా కోక చిలుకలా అవగలిగేది... ఇతరుల సాయం కొద్ది రోజులు మాత్రమే మన మీద మనకున్న నమ్మకం శాశ్వతం...
అందుకే నేడు గొంగళి పురుగులా ఉన్నామని బాధపడవద్దు..
కష్టాలకు ఎదురీదగలిగితే సీతాకోకచిలుకలా మారగలమని
ధైర్యంతో ముందడుగు వేయండి.. విజయం మీదే!!!
Here is best telugu inspirational moral stories for students good life lessons for friends well wishers, here you can freely down load online or freely share to face book google plus twitter feed tumblr and pinterest communities.
Inspirational Stories in Telugu 11 |
Post a Comment