Saturday 21 January 2023

Kanchipuram temples Full tour Guide - Kanchipuram Travel Guide in telugu - Kanchipuram temples information in telugu

Kanchipuram temples Full tour Guide

మమ్మల్ని visit చేసినందుకు ధన్యవాదములు... 

3500 సం. లు ఉన్న ఈ కాంచీపుర ఆలయాలను ఒక్కసారైనా చూశారా... మనం అడిగితే తప్ప ఆటో డ్రైవర్లు మనకు చూపించరు... రెండు ఆలయాలు చాలు రోజు మొత్తం అయిపోతుంది... 99% చూసి ఉండరు.. డైరెక్ట్ వీడియో క్రింద ఉంచాము.. చదవాలి అనుకునే వారికి వీడియో క్రింద matter ఉంచాము చూడండి

ఈరోజు కాంచి కాంచీపురం లోని ఆలయంల గురించి కాంచి పట్టణ దర్శనం గురించి తెలుసుకుందాం video 👇👇👇Kanchipuram temples Full tour Guide information

భారతదేశంలో అతి ప్రాచీన నగరాలుగా ఒక ఏడు నగరాలను చాలా పురాతన కాలం నుంచి కూడా చెబుతూ వచ్చారు

అవి మధుర కాశి కాంచి అవంతి మయ గయా ప్రయాగ
 
ఇందులో కాంచీపురం ఒకటి

Kanchipuram Information in telugu
కొన్ని వేల సంవత్సరముల కాలం నుండి కాంచీపురం ఒక వెలుగు వెలుగుతూనే ఉంది ఎంతోమంది రాజులు సామ్రాజ్యాధీశులు తమకు సంబంధించిన ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇస్తూ మనకు దానిని అందిస్తూ వెళ్తూ ఉన్నారు... అలా కాలక్రమమైన ఎన్నో వందల ఆలయాలు మనకి ఈ ఊరిలో మిగిలాయి... పల్లవులు చోళులు చాళుక్యులు పాండ్యులు లాంటివారు ఎంతమంది వచ్చినా మన ఆలయాలను ఎవరు డిస్టర్బ్ చేయలేదు... తమిళనాడులోని చాలా ఆలయాలు అదృష్టవశాత్తు తురుష్కుల దాడికి గురి కాలేదు.. అందుకే ఇప్పటికీ కాంచీపురంలో మనం కొన్ని వందల ఆలయాలను చూడగలుగుతున్నాం అయితే అన్ని ఆలయాలను మనం దర్శించేంత సమయము తీరిక ఉండకపోవచ్చు అందుకే మేము ఒకరోజు రెండు రోజులలో చాలా తీరికగా దర్శించుకునే వీలుగా ఒక పది అద్భుత ముఖ్యమైన చారిత్రక నేపథ్యం ఉన్న పది ఆలయముల గురించి మాత్రమే వివరిస్తున్నాను...
 
అవి 1. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం
2. ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం
3. వరదరాజ పెరుమాళ్ ఆలయం
4. కైలాసనాథర్ ఆలయం
5 వైకుంఠ పెరుమాళ్ ఆలయం
6 పాండవ దూత పెరుమాళ్ ఆలయం
7 వామనుమూర్తి ఆలయం
8 కచ్చపేశ్వర ఆలయం
9 కుమార కొట్టం
10 చిత్రగుప్త ఆలయం

ఈ ఆలయాలను దర్శించుకోవటానికి నేను సీక్వెన్స్ ఏమీ ఇవ్వటం లేదు ఎందుకంటే...
కాంచీపురం లో మాక్సిమం ఆలయాలు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం 12 గంటలకు ... తిరిగి నాలుగు గంటలకు సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే తెలిసి ఉంటాయి... అయితే వరదరాజ పెరుమాళ్ ఆలయం ఏడు గంటలకు.. కామాక్షి అమ్మవారి ఆలయం ఉదయం 6 గంటలకు ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్ లో మనకు తెలియకుండా ఓపెన్ కావచ్చు ... కామాక్షి అమ్మవారి ఆలయము ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయము మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా తెలిసి ఉంటాయి... అందుకే ఆటో డ్రైవర్ల సహాయం తీసుకుంటే... మనము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా ఆలయాలను చూడవచ్చు... ఆటో డ్రైవర్లు ఇచ్చే వివరాల వలన మనకి సౌలభ్యాన్ని బట్టి ఏ ఆలయం రష్ తక్కువ ఉన్న సమయంలో దర్శించుకోవచ్చు అనేది తెలుస్తుంది...

సాధారణంగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయము వరదరాజు పెరుమాళ్ ఆలయము కామాక్షి అమ్మవారి ఆలయం మాత్రమే ఎక్కువగా రద్దీ ఉంటాయి..
కైలాసనాథ దేవాలయము మరియు వైకుంఠ పెరుమాళ్ ఆలయాలలో శిల్ప సంపద చూడవలసిన అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసమే దానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు... ఆలయ శిల్పాల అందాలను చూడాలి అనుకునేవారు.. లీజర్ గా తగు ప్లాన్ చేసుకోండి...
మిగతా ఆలయాలన్నీ చాలా తక్కువ సమయాలలోనే దర్శనం అయిపోతుంది
అందుకే నేను ఆలయాల దర్శనానికి పద్ధతి అంటూ ఇవ్వటం లేదు మీ వీలును బట్టి ప్లాన్ చేసుకోండి...

Kanchipuram Temples Detailed information in telugu
ఇక ఒక్కొక్క ఆలయం గురించిన చిన్న చిన్న వివరణలను ఇస్తున్నాను

1.కంచి కామాక్షి అమ్మవారు..Kanchi Kamakshi amman temple information in telugu

అష్టాదశ శక్తి పీఠాలలో ఈ కాంచీ కామాక్షి అమ్మవారు కూడా ఒకరు... సతీదేవి యొక్క నాభి పడిన ప్రాంతం ఇది అమ్మవారు పద్మాసనములో యోగముద్రలో మనకి దర్శనమిస్తారు...అమ్మవారి చూపు తగిలితే చాలు మన మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం
ఈ క్షేత్రానికి ఆదిశంకరాచార్యుల వారి కి చాలా అవినాభావ సంబంధం ఉంది అందుకే ఇక్కడ కంచి కామ కోటి పీఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది వీలుంటే దానిని కూడా దర్శించండి కాంచీపురంలో ఎన్ని శివాలయాలు ఉన్న అమ్మవారి ఆలయాలు ఆ శివాలయాలలో ఉండవు అమ్మవారి ఆలయం ఒకేఒకటి ఇక్కడ కాంచీపురం కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోనే ఉంటుంది మనకి ఎక్కడ అమ్మవారి దర్శనాలు విడిగా ఉండవు

2.ఏకాంబరేశ్వర స్వామి ఆలయం- Ekambeshwara Swamy Temple information intelugu
కాంచీపురం మొత్తం అమ్మవారి వృత్తాంతం తోనే నిండి ఉంటుంది... పార్వతి దేవి అంశ అయినా కామాక్షి అమ్మవారు ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకొని వివాహం చేసుకున్నదట అందుకే ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది... అమ్మవారు పూజించిన ఆ చెట్టు ఇప్పటికే ఎకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో ఉంటుంది అమ్మవారు ప్రతిష్టించిన ఇసుకతో చేసిన ఆ లింగం కూడా ఏకాంబరీశ్వర స్వామి వారి ఆలయంలో మనకి కనపడుతుంది... కాబట్టి ఈ రెండు ఆలయాలు మనం మొదటి స్థానంలో ఉంచాము ... ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో 3500 సంవత్సరాల క్రితం అమ్మవారు పూజించినట్లుగా చెప్పబడుతున్న వృక్షానికి సంబంధించిన మాను అక్కడే ఒకచోట భద్రంగా ఉంచారు దానిని తప్పకుండా చూడండి... అమ్మవారు తపస్సు చేసిన వృక్షం ఉండే చోటనే మరొక వృక్షాన్ని ఉంచారు ఆ వృక్షం సమీపంలోనే పార్వతీదేవి అమ్మవారు శివుడు మరియు కుమారస్వామి సమేతంగా ఒక చిన్న గుడి లాగా ఉంటుంది అది కూడా చూడండి... ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ మండపాలు అందులో ఉండే స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ప్రదక్షిణ మండపంలో కూడా మనకు భారతదేశంలో ఉన్న అన్ని శివాలయాలలో ఉన్న శివలింగ నమూనాలు అయ్యనార్ల విగ్రహాలు అన్ని బారుగా వరుసలు తీరి మనకి చాలా కనువిందు చేస్తాయి...
ఈ ఆలయ ప్రధాన గోపురం దాని చుట్టూ పరిసరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కొంచెం సమయాన్ని వెచ్చించి ఫోటోలు వీడియోలు లాంటివి ఈడ మనకి తీపి గుర్తులను ఇస్తాయి కాబట్టి కొంచెం సమయాన్ని వెచ్చించండి ఈ ఆలయ సమీపంలో చీరల అంగళ్లు కూడా చాలా ఉంటాయి ఏదైనా అవసరమైతే షాపింగ్ చేసుకోవచ్చు..

3.కచ్చపేశ్వర ఆలయం- Kachabeshwara swamy temple information intelugu
ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం
లో మనకి ఎలాంటి రూపం అయితే ఉంటుందో సేమ్ అదే రూపుతో ఒక నమూనా ఆలయం లాగా కచపేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా మనకి కనపడుతుంది ఒకవేళ ఏకాంబరీశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం సాఫీగా జరగనప్పుడు ఈ కచపేశ్వర స్వామి వారి ఆలయంలో మనం స్వామిని దర్శించుకోవచ్చు...
ఇక్కడ ఆలయంలో కోనేరులో చాలా చేపలను వేశారు పిల్లలు కొంచెం సేపు ఎక్కడ శాదాతీరవచ్చు వాటితో ఆడుకోవచ్చు ఈ ఆలయం బస్టాండుకు చాలా సమీపంలో ఉంటుంది రిటన్ వెళ్లేటప్పుడు ఈ ఆ లైను చూసుకొని వెళ్తే సమయం ఆదా అవుతుంది

4.చిత్రగుప్త ఆలయం - Chitraguptha swami temple information in telugu
కచ్చపేశ్వర ఆలయానికి అత్యంత సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయంలో యమధర్మరాజు వారి ప్రధాన అనుచరుడైన చిత్రగుప్తుల వారి ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఈ అమ్మ బాధలు ఉండవు అని ఒక నమ్మకం మన భారతదేశంలో విడిగా చిత్రగుప్తుల వారికి ఎక్కడ ఆలయం ఉండదు కాబట్టి ఇది ప్రత్యేకంగా కాబట్టి ఇక్కడ మనం దర్శించుకుంటే బాగుంటుంది
కుమార కొట్టం
ఆలయంలో స్కందపురానాన్ని రాసినప్పుడు కుమారస్వామి ఆకారం ఎలా ఉందో ఆ ఆకారంలో కుమారస్వామి ఇక్కడ విగ్రహంగా ఉంచి పూజిస్తూ ఉన్నారు... కుమారస్వామి ఆరాధన చేసే వారికి ఈ ఆలయం ముఖ్యమైనది
ఈ ఆలయం కూడా చిత్రగుప్త స్వామి వారి ఆలయాన్ని పరిసరాలలోనే ఉంటుంది
వైకుంఠ పెరుమాళ్ ఆలయం
ఈ ఆలయం కాంచీపురం ఆలయాల అన్నిటిలో కెల్లా అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని పల్లవులు కట్టించారు ఇందులో శ్రీమహావిష్ణువు... మూడు అంతస్తుల లో మూడు విధాలలో మనకి కనపడతారు...
గ్రౌండ్ ఫ్లోర్ లో స్వామి వారు కూర్చుని పల్లవ రోజుకు సూచనలు ఇస్తున్నట్లుగా మొదటి అంతస్తులు నిలబడిన స్థితిలో రెండవ అంతస్తులు రెండవ అంతస్తులు షైనస్థితిలో.. దర్శనమిస్తారు... అయితే కేవలం ఏకాదశి రోజు మాత్రమే మొదటి అంతస్తులుకి ప్రవేశం ఉంటుంది రెండవ అంతస్తులుకి ఎవరిని అనుమతించడం లేదు... అందుకే కాంచీపురాన్ని ఏకాదశి నాడు దర్శించుకుంటే ఉదయం పూటనే ఈ ఆలయాన్ని దర్శించేందుకు ప్రయత్నించండి.. ఈ ఆలయంలో ఇంకొక విచిత్రం ఏమిటంటే పై ఆలయానికి వెళ్లేందుకు ఎక్కడ మెట్లు కనపడవు క్రింద ఆలయం నుండి మాత్రమే పై ఆలయానికి మెట్లు ఉంటాయి బయట నుండి చూస్తే ఒకే ఆలయం ఉన్నట్లుగా ఉంటుంది పైన ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి అని నమూనా కూడా మనకి తెలియదు... చాలా అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయం చుట్టూ ఉండే శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది చాలా క్రిక్కిరిసిపోయి ఉంటుంది... శిల్పాలలో పల్లవరాజైన నరసింహ వర్మ చేసిన వేరు వేరు పనుల గురించి ఆలయ శిల్పాల నిర్మాణం జరిగేటప్పుడు జరిగిన ఎన్నో ఇతివృత్తాలను విష్ణు పురాణానికి సంబంధించిన ఎన్నో కథలను విడివిడిగా శిల్పికరించారు... చాలా లేజరుగా చూడాలి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కాంచీపురంలో చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి

కైలాస నాతార్ ఆలయం Kailasanathar Temple
ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా నేను ఇంకొక వీడియో చేశాను ఎందుకంటే అంత అద్భుతమైన ఆలయం ఇది విడిగా దాని లింకు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ఈ ఆలయాన్ని కూడా పల్లవులే నిర్మించారు ఈ ఆలయం గర్భగుడిలో ఒక చిన్న సొరంగ మార్గం ఉంటుంది ఆ సారంగ మార్గం గుండా ఆలయాన్ని శివలింగాన్ని కనుక ప్రదక్షిణం చేస్తే పునర్జన్మ ఉండదు అని నమ్మకం అందుకోసమే తప్పనిసరిగా ఆ సొరంగ మార్గం గుండా ఒక ప్రదక్షిణ చేయండి... ఆ రోజుల్లో బౌద్ధం కూడా పరిఢవిల్లింది ఇక్కడ బౌద్ధ సన్యాసులు విడిగా కూర్చొని ధ్యానం చేసుకునేందుకు వీలుగా చుట్టూ చిన్న చిన్న ఆలయాలను చెప్పారు ఆలయాలలో శిల్పాలను ప్రతిక్షేపించారు చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి

పాండవ దూత పెరుమాళ్ ఆలయం Pandavadootha perumal temple
శ్రీకృష్ణుడు పాండవుల దూతగా ఐదు గ్రామాలను కౌరవుల దగ్గర అడగటానికి వెళ్లిన రూపంలో స్వామివారిని ఇక్కడ పూజిస్తారు... శ్రీకృష్ణుడు ఈ రూపంలో మనకి ఎక్కడ ఏ ఆలయంలో కూడా మనకు కనిపించరు అందుకోసమే ఈ ఆలయం ఒక ప్రత్యేకమైనది ఇందులో దాదాపుగా ఒక 20 అడుగుల విగ్రహం నిలువెత్తు విగ్రహం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మిస్ కావద్దు

వామన మూర్తి ఆలయం Vamanamurthy Temple
ఈ ఆలయంలో వామనుడి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు దర్శనం ఇస్తారు అయితే అన్ని ఆలయాలలో మరుగుజ్జులాగా ఉన్న వామనుమూర్తి మాత్రమే మనకి కనపడితే ఈ ఆలయంలో విశ్వాన్ని మొత్తం ఆక్రమించిన మహా వామనమూర్తి రూపంలో దాదాపు ఒక 30 అడుగుల విగ్రహం కింద బలి చక్రవర్తి తో సహా మనకి దర్శనం ఇస్తారు... చాలా అద్భుత రూపాలలో ఉన్న ఆలయాలలో ఇది ఒకటి తప్పక దర్శించండి..

వరదరాజ పెరుమాళ్ ఆలయం Varadaraja Perumal temple(Vishnu Kanchi)
ఈ ఆలయానికి సంబంధించి కూడా నేను విడిగా వీడియో చేశాను దాని లింకు కూడా క్రింద ఇస్తున్నాను.. వైష్ణవులు అత్యంత పవిత్రంగా భావించే 108 దివ్య దేశ క్షేత్రాలు లో ఈ క్షేత్రం ఒకటి... మొదట వరదరాజ పెరుమాళ్ వారి మూలవిరాట్ వచ్చి అత్తిలి వరదరాజ స్వామి వారిగా ఉండేది అయితే అప్పుడు తురుష్కుల దండయాత్రకు గురవుతుంది అనే సందేహంతో మూలవిరాట్ని ఒక కోనేరులో దాచి పెట్టారట దాదాపుగా 40 సంవత్సరాలు అందులోనే ఉండిపోయింది అయితే దండయాత్ర ముగిసిన తర్వాత ఆ మూలవిరాట్ ఉన్న ప్రదేశం చాలా వరకి గుర్తు లేకపోవటం వలన లభించలేదు అందుకే వేరొక మూర్తిని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రతిష్ఠేపించారు ప్రస్తుతం మనకి కనపడే మూర్తి అదే అయితే దాదాపుగా 40 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి దుర్భిక్షం వలన పూర్తిగా కోనేరు ఎండిపోయిన తర్వాత స్వామివారి రూపం బయటికి వచ్చింది అట అలా బయటికి వచ్చిన అత్తి వరదరాజ స్వామి వారిని ఒక ఆచారం లాగా 40 సంవత్సరాలు కి ఒకసారి బయటికి తీసి ఉత్సవం లాగా జరుపుతారు పోయిన సంవత్సరం మనకి అత్తి వరదరాజ స్వామి వారి దర్శనం జరిగింది... వరదరాజ స్వామి వారి ఆలయంలోని బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి ఇవి సరిసృప దోషాలు ఏదైనా ఉన్నప్పుడు అంటే బల్లులు లాంటి వాటిని చంపటం తెలియకుండా వాటికి అపచారం జరగటం జరిగితే వాటిని తాగటం వల్ల వచ్చే దోషాలన్నీ ఇక్కడ వీటిని తాకినప్పుడు పోతాయి అనేది ఒక నమ్మకం ఉంది అందుకే ఆ దోషాలను తొలగించుకోవాలంటే ఇక్కడ బంగారు వాళ్ళని వెండి బల్లని తప్పనిసరిగా తాకవలసి ఉంటుంది ఆ గుడి వరదరాజ పెరుమల ఆలయంలోనే ఉంటుంది... తయార్ అమ్మవారి సన్నిధి కూడా ఇక్కడే ఉంటుంది... మనం ఉదయం ఆరు గంటలకు ఈ ఆలయానికి చేరుకుంటే సుదర్శన చక్ర ఆల్వార్ సన్నిధిని అత్రి వరరాజస్వామి వారి ఆలయాన్ని ఆ వంద కాళ్ల మండపాన్ని చూసేసరికి ఉదయం 7:00 అవుతుంది ఆ సమయంలో ఈ ఆలయంలోనే ఉన్న నరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం వరదరాజ స్వామి వారిని దర్శించి ఆ తర్వాత బంగారు బల్లిని వెండి బల్లిని దర్శించుకుని బయటికి వచ్చేసరికి 8:30 అవుతుంది ఆ సమయంలో ఇక్కడ పొంగలిని ప్రత్యేకంగా నివేదిస్తారు అంటే పొంగలిని తయారు చేసే విధానం వేరే ... అది తప్పనిసరిగా తీసుకోండి దాదాపుగా ఒక పొట్లం 150 రూపాయలు దాకా ఉంటుంది కానీ కనీసం ఐదు మందికి వచ్చే విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మిస్ కావొద్దు...

How to reach Kanchipuram
కాంచీపురం యాత్ర అనేది మనం ఎన్ని గంటలకు కాంచీపురానికి వెళ్ళాము అనేదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి వీలైనంత పెందలాడే అక్కడికి వెళ్తే మనం ఎక్కువ ఆలయాలను దర్శించుకోవచ్చు...

Tirupati to Kanchipuram Bus facillities
 తిరుపతి బస్టాండ్ నాలుగో నెంబర్ ప్లాట్ఫారం దగ్గర నుండి బస్సులు ఉదయం నాలుగు గంటల నుండి బయలుదేరుతాయి కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే మనం కాంచీపురానికి ఏడు లోపల చేరుకోవచ్చు...
 
అత్యుత్తమమైన పద్ధతి ఏమిటంటే మొదట కాంచి పురయాత్రను ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా టికెట్లను బుక్ చేసుకుంటే మంచిది...

Best Travelling mode to reach Kanchipuram

కాంచీపురానికి అరక్కోణం అనే స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది ఒక గంటలోపులో మనం ఈ స్టేషన్ నుండి చేరుకోవచ్చు... రేణిగుంట మీదుగా వెళుతుంది ఈ ఆలయం తిరుపతికి టచ్ కాదు అందువలన దాదాపుగా మూడు గంటల సమయం కలిసి వస్తుంది కాబట్టి ఉదయం 4 5 లోపల కాంచీపురాన్ని చేరుకునే విధంగా ప్లాన్ చేస్తే ఒక గంట సేపు రిఫ్రెష్ అయిన ఉదయం ఆరు నుండే మనం మన యాత్రను మొదలుపెట్టే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి అరకోణంలో ఎక్కువసేపు ట్రైన్ నిలబడదు కాబట్టి వీలైనంత త్వరగా దిగితే బెటర్ జాగ్రత్త...
శంకరమఠంలో యాత్రి నివాసులో... కొన్ని గవర్నమెంట్ కు సంబంధించిన సత్రాలు లో మరియు ప్రైవేటు లాడ్జిలలో పెద్దగా

Accommodation at Kanchipuram
వ్యత్యాసం ఉండదు... ఆర్యవైశ్య సత్రాలు లాంటివి కూడా ఉంటాయి... షేర్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి... కాంచీపురం లో వసతికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు లాకర్స్ కూడా దొరుకుతాయి తగువిధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి... డిస్క్రిప్షన్లో నా బ్లాక్ పోస్టు లింకు కూడా ఉంచుతున్నాను అందులో పూర్తి వివరాలు అకామిడేషన్ ఫోన్ నెంబర్లతో సహా ఉంటాయి మీరు ఉపయోగించుకోవచ్చు..
కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సమీపంలో ఉండే లాడ్జిలో లేదా సత్రంలో బస ఏర్పాటు చేసుకుంటే మంచిది మనం ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా నడిచిపోయేంత దూరంలో దాదాపుగా నాలుగో ఆలయాలు ఉంటాయి. అందుకే బస కామాక్షి అమ్మవారి ఆలయానికి దగ్గరగా తీసుకోమని నేను prefer చేస్తున్నాను..

ప్రతి ఆలయం గురించి చాలా వివరంగా మంచి క్వాలిటీ తో వీడియో చేసాము... మీకు తప్పక నచ్చుతుంది... చూడండి మా చానెల్ ను scribe చేసుకోండి.. మీరు కూడా మాకు సాయం చేసినట్లు అవుతుంది.. Post a Comment

Whatsapp Button works on Mobile Device only