why we are celebrating republicday in telugu,
difference between republic day and Independence day
రిపబ్లిక్ డే అంటే ఏమిటి??
స్వాత్రంత్ర్య దినానికి రిపబ్లిక్ డే కు తేడా ఏమిటి??
మనకు 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది... కానీ వాస్తవంగా రోజు నుండే పూర్తిగా భారత దేశానికి స్వాతంత్ర్యం రాలేదు.. భారతదేశం తనంతట తాను ఒక వ్యవస్థగా ఎదగాలంటే.. కొన్ని నియమావళి అవసరం.. అంటే ఒక రాజ్యం పూర్తిగా నియమ నిబద్ధతలో నడవాలంటే ఒక రాజ్యాంగం అవసరం.. ఈ రాజ్యాంగం అనేది రాజ్యంలోని ఒక అంగం అన్నమాట.. ఇది ఒక రకంగా మెదడు లాంటిది.. దేశంలోని అన్నిరకాల వ్యవస్థలు దీనిని అనుసరించే నడుస్తాయి..(అంటే ప్రజల సాధారణ జీవితం ఎలా నడవాలో దగ్గర నుండి.. చట్టసభలు, పోలీసు స్టేషన్, డాక్టర్, లాయర్ లాంటి వృత్తులనుండి మొదలు.. ఎలా నడవాలి అని తెలిపే ఒక గ్రంథం కావాలి.. దీనిలో లేని విధంగా రాజ్యం నడవదు..) అందుకే ఇలాంటి రాజ్యాంగం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది..ఈ కమిటీ అప్పటి ప్రజాస్వామ్య దేశాలయిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచిని గ్రహించి రూపొందించబడినదే మన రాజ్యాంగం.. ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన మన భారతీయ రాజ్యాంగం ఎంతో గౌరవించదగినది.. అయితే ఈ రాజ్యాంగం రచన 1947లో మొదలు పెట్టినా.. 1950 జనవరి 26 న కానీ ముగియలేదు... మన రాజ్యాంగం సంపూర్ణంగా అవిష్కరింపబడిన తర్వాత మాత్రమే మనం సర్వ సత్తాక రాజ్యాంగం గా ఆమోదించినట్లు లెక్క.. అందుకే రిపబ్లిక్ డే అనేది మనకు ముఖ్యమైన పండుగ రోజు అయింది..
మన రాజ్యాంగంలో పడినన్ని సవరణలు ఏ రాజ్యాంగంలోనూ లేవు.. ఇవన్నీ ఆయా ప్రభుత్వాలు తమకు అనుగుణంగా మార్చుకున్నవే కానీ రాజ్యాంగం తప్పులేదు.. వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా.. మనదేశంలో ఉన్నన్ని జాతులు మతములు భాశలు తెగలు.. షెడ్యూళ్ళు ఏ దేశంలోనూ లేవు.. అయితే ఇన్ని ఉన్నా.. మనమంతా ఒకరం.. అదే మనం భారతీయులం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!!
"గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి... ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా"
best republic day messages for facebook whatsapp twitter free download sharing
- అలెగ్జాండర్ హెన్రీ
"
మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు... ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ" - లాల్ బహదూర్ శాస్త్రి
republic day telugu sms quotes free download
"మనం భారతీయులం. మొదటి నుంచీ... చివరి వరకూ" - డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్
"ప్రతీ భారతీయ పౌరుడూ ఇప్పుడు తాను రాజ్ పుత్ లేదా సిక్కు లేదా జాట్ అనేది మర్చిపోవాలి. ప్రతి ఒక్కరూ తాము భారతీయులం అని భావించాలి"
Post a Comment