Wednesday 12 January 2022

Swami Vivekananda Telugu Quotes on Vivekananda Jayanti wishes images free download pdf video

Here is Swami Vivekananda Telugu Quotes on Vivekananda Jayanti wishes images free download pdf video, best of swami vivekananda telugu quotes for youth, swami vivekananda quotes in telugu pdf, vivekananda quotes in telugu for whatsapp, swami vivekananda 365 quotes in telugu, swami vivekananda telugu quotes for students, swami vivekananda quotes in telugu wallpapers, swami vivekananda inspirational quotes in telugu,


Best of Swami vivekananda quotes in telugu
విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.

డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.

Swami vivekananda message for youth in telugu
విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.
Swami vivekananda Quotes about education
అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది,పట్టుదల,ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.

స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.
Vivekananda telugu quotations free download
పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది. ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.
1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం 2.అసూయ,అనుమానాల రాహిత్యం 3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం. 

 భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే.
నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.

దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవించ లేడు.

పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

Swami Vivekananda speech in Chicago, 11th september 1893

మరిన్ని వివేకానంద స్వామి వారి కొటేషన్స్ కై ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇
Best of Swami Vivekananda Quotes in telugu 

 క్రింది లింక్ లో మరిన్ని inspirationa Quotes ఉన్నవి.. చూడగలరు
👇👇👇
Collection of Best Telugu inspirational Quotes 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only