Tuesday 20 December 2022

Ekambareshwarar Temple Kanchipuram complete tour guide in telugu

Ekambareshwarar Temple Kanchipuram complete tour guide in telugu 
ఏకాంబరేశ్వర ఆలయం - కాంచీపురం
పార్వతీ అమ్మవారు తపస్సు చేసిన 3500 సంవత్సరముల వయస్సు గల మామిడి చెట్టు - ఇప్పటికీ కాంచీపురంలోని ఈ ఆలయం లో ఉంది...

కాంచీపుర ఆలయాలలో శివకంచిలోని ఈ ఏకాంబరేశ్వర ఆలయం ప్రధానమైనది... ... పంచభూత లింగ క్షేత్రాలలో పృథ్వీ లింగ క్షేత్రం ఇది... 



 భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో కంచి లో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయ గోపురం ఒకటి.... ఏకాంబరేశ్వర ఆలయానికి నాలుగు వైపుల కూడా ద్వారాలు ఉంటాయి.. ప్రతి ద్వారం గుండా వెళ్ళేటప్పుడు ఒక మండపం వచెలా... దేవాలయ నిర్మాణం జరిగింది... దేవాలయం చుట్టూ ఉండే ఈ మండపం అద్భుత శిల్పాలతో పైకప్పు అద్భుత తైలవన్న చిత్రాలతో నిండి ఉంటుంది... సాధారణంగా ప్రతి ఆలయంలో కోనేరు ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా ఒక చక్కటి కోనేరు ఉంటుంది... ఆలయ ప్రవేశద్వారం నుండి గర్భగుడి దాక వచ్చే వేరు వేరు ప్రాకారాలలో ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది... ఒక మండపంలో వరసగా అయ్యనార్ల విగ్రహాలు ఉంటే ఇంకొక మండపంలో వరుసగా శివలింగాలు ఉంటాయి... ఈ ఆలయంలో ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు వరుసగా కనపడతాయి .. ...ప్రధాన మండపంలో 1000 స్తంభాలు వరుసుగా కనబడడం చూడటానికి అద్భుతంగా ఉంటుంది....

ఏకామ్రము అంటే ఒక మామిడి చెట్టు అని అర్థం... ఇప్పుడు మనం చూస్తున్నఈ మామిడిచెట్టు కిందే అమ్మవారు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసుకుని ఆ శివలింగానికి రోజు పూజించేదట... మహాశివుడు ఎన్నో పరీక్షలను పెట్టిన తర్వాత మాత్రమే అమ్మవారికి సాక్షాత్కరించారు అని కథనం.. అందుకే అమ్మవారు పూజించిన ఆ సైకత లింగాన్ని మరియుఈ మామిడి చెట్టు ని 3500 సంవత్సరముల నుండి సంరక్షిస్తూనే ఉన్నారు.. పూర్వం ఈ మామిడి వృక్షంలో నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పండ్లను ఇచ్చేవట.. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు సేవిస్తే సంతానం కలుగుతుంది అని నమ్మకం... ఇంతటి ప్రాశస్త్యం గల ఈ మామిడి చెట్టు కాండాన్ని ఇప్పటివరకు కూడా కాపాడుతూనే ఉన్నారు... ఈ కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఆ పురాతన మామిడి వృక్షం స్థానంలో కొత్తగామరొక మామిడి వృక్షాన్ని అంటు పద్ధతిలో నాటారు... ఇప్పుడు మనకు కనపడుతున్న చెట్టు ఆ ప్రధాన వృక్షం నుండి వచ్చిన అంటూ పెట్టిన వృక్షమే... ఈ మావిడి చెట్టు కింద నే పరమేశ్వరుడు పార్వతి దేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు... ఇప్పటికి కూడా అమ్మవారు ప్రతిష్టించిన ఆలింగానికే పూజలు చేస్తారు సైకత లింగం కాబట్టి ఈ లింగానికి నీటితో అభిషేకించకుండా కేవలం తేనెతో మరియు పాలతో మాత్రమే అభిషేకిస్తారు... కాంచీపురం లోని ప్రతి ఆలయంలోనూ ఈ ఇతివృత్తానికి సంబంధించిన చిత్రం కానీ శిల్పం కానీ తప్పక ఉంటుంది
ఈ ఆలయాన్ని హడావిడిగా కాకుండా చాలా లీజర్ గా చూస్తే బాగుంటుంది... అందుకే ఆటో వాళ్ళ గోలను పెట్టుకోకూడదు ఇక్కడ వరకే డ్రాపింగ్ కి ఏర్పాటు చేసుకుంటే మంచిది...
ఆరోజుల్లోనే అంటు పద్ధతిలో ఒకే చెట్టు నుండి నాలుగు రకాలైన రుచులు గల ఫలాలను ఉద్భవించేలా చేయటం అద్భుతము అయితే... .. దానిని ఇప్పటివరకు కూడా సంరక్షించి మన ముందు తరాలకు అందించాలి అనే కాన్సెప్ట్ ఇంకా అద్భుతం... అందుకే ఇప్పటికి కూడా మనం ఆ కాండాన్ని చూడగలుగుతున్నాం... నిజంగా మన దేవాలయాలు అద్భుతమైన కాన్సెప్ట్ కు నిదర్శనాలు... ఇక్కడ జెనెటిక్ గా ఒక మామిడి చెట్టుని 3 వేల 500 సంవత్సరాల నుండి అందించడమే కాకుండా ఈ పంచభూత క్షేత్ర లన్ని ఒకే కోఆర్డినేషన్ పై ఉండటం అనేది ఇంకొక అద్భుతం... పంచభూతలింగ క్షేత్రాలైన గాలి ఆకాశం భూమి నీరు నిప్పు ఈ ఐదు క్షేత్రాలు కూడా ఒకే కోఆర్డినేట్ పై ఉంటాయి మనం భారతదేశ చిత్రపటంలో చూసినప్పుడు కూడా ఈ అద్భుతం మనకు సాక్షాత్కరిస్తుంది... మన ప్రతి ఆలయ నిర్మాణం వెనుక ఒక కృషి పట్టుదల... సైన్స్ పరంగా ఒక కారణం దర్శించేటప్పుడు మనకు కలిగే అనుభూతులు.. ఇలా ఎన్నో రకాలైన అంశాలను పరిగణలోకి తీసుకుని మన దేవాలయాలు నిర్మిస్తారు... వాటిని పూర్తి కుటుంబంతో పాటు దర్శించినప్పుడల్లా మనం జీవితంలో అప్పటిదాకా పొందిన సమస్యలు కష్టాలు అన్నిటినీ మరిచిపోయి ఒక కొత్త సంతృప్తితో మన జీవితాన్ని పునః ప్రారంభిస్తాము అనేది ఈ దేవాలయాల దర్శనాల వెనక ఉన్న పరమార్థం... జీవితకాలంలో కొంత సమయం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పొందే అద్భుతమైన అనుభూతులలో కుటుంబంతో పాటు వెళ్లే ఈ దేవాలయ దర్శనం చాలా ఎక్కువ గుర్తులను ఇస్తుంది అందుకే దేవాలయాల దర్శనాలను తప్పనిసరి చేశారు మన పెద్దలు... ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఈ కథనం... మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే నోటిఫికేషన్లు రావడానికి బెల్గాండ్ను కూడా నొక్కండి మరింత మందికి ఈ కాంటినెంట్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా కాంచీపురానికి వెళ్లే వారికి ఉపయోగపడుతుంది..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only