Thursday 22 December 2022

Chaya Someshwara Alayam - Chaya - mystery revealed video downloadఛాయ మిస్టరీ వీడినది . అద్భుతాలకు నిలయం ఛాయా సోమేశ్వరాలయం

Chaya Someshwara Alayam - information - full tour guide in telugu
'ఛాయ' మిస్టరీ వీడినది . అద్భుతాలకు నిలయం ఛాయా సోమేశ్వరాలయం

అద్భుతమైన కాన్సెప్ట్ తో నిర్మించిన అత్యంత పురాతన ఆలయాన్ని చూడబోతున్నాం... ఈ ఆలయము నల్లగొండ పట్టణ శివారులలో పానగల్లు దగ్గర ఉంది.. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు ఈ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలించేటప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించినారు.. ఈ ఆలయం నిర్మించి దాదాపు వెయ్యి సంవత్సరాలయింది... ఈ ఆలయం చూడటానికి ఎంతో చిన్నగా సింపుల్ గా కనబడుతుంది... కానీ ఆలయ నిర్మాణంలో ఎన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ ని అనుగుణంగా చేసుకొని నిర్మించారు పూర్తిగా మీకు వివరిస్తే తప్ప తెలియదు...



ఈ ఆలయం మూడు గర్భగుడులు ఒకదాని పక్కన ఒకటి ఉన్నట్లుగా కనపడతాయి... అయితే ప్రధాన గుడి లో ఉండే శివలింగం మీద ఒక స్తంభం నీడ స్థిరంగా ఉంటుంది ... ఇది రోజు మొత్తం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిలకడగా ఆ నీడ అంతే ఉంటుంది... వేయి స్తంభాల గుడిలో ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా స్తంభాలు పక్కపక్కన ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి చాలా అద్భుతంగా కనపడతాయి... ప్రతి స్తంభం కూడా చక్కటి శిల్పాలతో నిర్మించబడి ఉంది.. ఈ స్తంభాల మీద నుండి వచ్చే నీడ గర్భాలయంలో ఉన్న శివలింగం మీద పడుతుంది...అయితే శివలింగం మీద పడే ఆ నీడ ఏ స్తంభం నుంచి వస్తుంది అనేది మనకి తెలియదు... ఎందుకంటే ఏదైనా స్తంభాన్ని వెనుక మనం చెయ్యి ఆడిస్తే శివలింగం మీద పడే నీడ డిస్టర్బ్ కావాలి కానీ అలా కాదు.. మనం టెస్టింగ్ కోసం నాలుగైదు స్తంభాలని అలా చేసినా గాని శివలింగం మీద పడే నీడ డిస్టర్బ్ కాదు... నిన్న మొన్నటి వరికి దీనిని ఒక మహత్యం లాగానే ప్రజలు భావించేవారు దీని యొక్క సీక్రెట్ అనేది బయటికి తెలియలేదు...

ఈ సీక్రెట్ కొన్ని వందల సంవత్సరాలైనా ఎవరూ ఛేదించలేకపోయారు...
కాలక్రమేనా ఈ ఆలయం దాదాపు శిథిలమై పూర్తిగా మూసివేస్తారు అనుకునే సమయంలో నల్లగొండలో పనిచేసే ఒక లెక్చరర్ ఈ ఆలయ రహస్యాన్ని ఛేదించే సాహసం చేసి ... ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపి చివరకు రహస్యాన్ని ఛేదించారు... కాంతి వక్రీభవన సిద్ధాంతం ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించాలని ప్రయోగం చేసి చూపించారు... అప్పటినుండి ఈ ఆలయం ఇంకా ఫేమస్ అయ్యి పూర్తిగా పునరుద్ధరణకు నోచుకుని ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ వీడియోలో చూసిన విధంగా ఉంది.. ఈ ఆలయాన్ని సూర్య గమనం ఆధారంగా చేసుకుని నిర్మించారు...
 


సూర్యుడి నుండి వచ్చే వెలుగు స్తంభాల నుండి వక్రీభవనం చెంది ఆ స్తంభాల ఉమ్మడి నీడ లింగం పై పడుతుంది అందుకే ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క స్తంభం నీడ ప్రభావం చూపలేదు కాబట్టి మనకి డైరెక్ట్ గా చూసినప్పుడు అంటే స్తంభానికి శివలింగానికి మధ్యలో అడ్డుపెట్టినప్పుడు మనకు ఏ తేడా అనిపించదు... మన మొన్నటి వరకు కేవలం పోస్ట్ ని చదవటం మాత్రమే చూసాము ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎలా అనుభూతి చెందారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయగలరు..మీరు కూడా మాకు చేయూతనిచ్చినట్లు అవుతుంది 
please subscribe
..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only