Saturday, 16 April 2016

Inspirational Life Stories - Telugu Quotes

Inspirational story: Read completely: 
ఒకరోజు ఒక ఆటో ప్రమాదవ శాత్తూ రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి పడిపోయింది...ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో పడిపోయారు... ఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మూగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించసాగారు.. ముగ్గురిలో ఒక వ్యక్తి ఈతరాక వెంటనే మునిగిపొయాడు.. మిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం చేయసాగారు... చుట్టూ ఉన్న గోడలన్నీ నున్నగా జారుడుగా ఉండడం వలన ఎంతకూ పైకి ఎక్కలేక పోతున్నారు... వారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహగా మీరు ఇంతే చని పోవడం ఖాయం అంటూ అరవ సాగారు... ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంలో మునిగిపొయి చని పోతాడు.. కానీ మూడవ వ్యక్తి మాత్రం వారు నిరుత్సాహ పరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకుని ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేయసాగాడు.. చివరికి ఒక గంట తర్వాత ఫైరింజన్ సర్వీసు వారు వచ్చి బావిలోపలికి నిచ్చెన వేసి ఆ వ్యక్తిని పైకి లాగుతారు... పైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తూ... ఇంత మంది నిన్ను నిరుత్సాహ పరచినా ఎలా నిలవగలిగావు అని అడుగుతారు.. అందుకు ఆ వ్యక్తి... బాబూ నాకు బ్రహ్మ చెవుడు.. మీరు మాట్లాడేదేదీ నాకు వినపడదు.. కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశ్యం నాకు అర్థమయింది.. అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహ పరచాయి.. మీకందరికీ ధన్యవాదములు.. అని చుట్టూ ఉన్న వారికి చేతులు జోడించి నమస్కరిస్తాడు... 
Inspirational Life Stories - Telugu Quotes
Inspirational Life Stories - Telugu Quotes
Moral: మనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే... చుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే.. మన ప్రయత్నం మనం చేస్తున్నపుడు.. ఎవరో ఒకరు మనను ఆదుకునే అవకాశం ఉంది.. చివరి వరకు నిరుత్సాహ పడక... ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి...
జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకదన్నంత వరకు పోరాడు...
లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు..
ఆశను విడవకూడదు....
చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగవచ్చు..



Key Words: Inspirational Stories in Telugu, Best life motivational stories in telugu, Heart touching life stories in telugu.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only