Heart touching story:
ఓ అమ్మ కథ మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను. ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను. “క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.
ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?
Key words:
Mother Quotes in Telugu, Amma kavithalu Telugu, Mother Quotes in Telugu, Amma kavithalu Telugu, Mother's Day Telugu Quotes Greetings, Happy Mother's Day Quotes Greetings in Telugu, Nice Mother's Day Telugu greetings for friends, Mother's Day Wishes greetings pictures wallpapers,
ఓ అమ్మ కథ మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
Greatness of Mother - Telugu heart touching Stories |

Post a Comment