ఇది ఒక అధ్భుత కథ!
అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!
ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ..ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు! అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో పచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు! దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు! గాలి చొరబడిని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనాని గ్రహించాడు! గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీప సమాది కాబోతున్నాననుకుంటున్న సమయంలో.... ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి... ఆశ్చర్యం... టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు!
బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే "నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?" అడిగాడు గార్డ్ ని!
"ఎవ్వరూ చెప్పలేదు సార్! ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్! ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!"
అతనూహించలేదు.. అతనికి ముందుగా తెలియదు! భేషిజం గాని బాన్'ఇజం గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని! మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని!
నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రమాణికం కాదు!
Post Courtesy: Bhogeswara Reddy Rachamalla
Key words: Heart touching Stories in Telugu, Telugu Heart touching Stories, best inspirational stories in telugu.

Good Morning Greetings with heart touching stories in Telugu |
Post a Comment