Saturday 2 October 2021

Lal Bahadur Shastri Jayanthi wishes images greetings in telugu language free download

Few Incidents - Information which describes about the greatness of Shri Lal Bahadur Shastri:
ఈరోజు మహాత్మా గాంధి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల పుట్టినరోజు. కానీ మీడియాలో .... గాంధీగారికి లభించిన ప్రాముఖ్యత లాల్ బహుదూర్ శాస్త్రి గారికి లభించటం లేదు... అందుకే ఈ పోస్టు... దేశ స్వాతంత్రం కోసం గాంధీ నెహ్రులు మాత్రమే కాక మరెంతో మంది దేశభక్తులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేశారు అలాంటి వారిలో అతివాద నాయకుడిగా లాల్, బాల్, పాల్ గారల త్రయానికి ఎంతో పేరు ఉంది... లాల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు....

డా. సందీప్ శాస్త్రి గారు 2019 లో వ్రాసి ముద్రించిన Lal Bahadur Sastri : Politics and Beyond అనే పుస్తకంలో ఒక సంఘటన ఇలా వుంది : స్వాతంత్ర పోరాట సమయంలో శాస్త్రి గారిని బ్రిటీషు ప్రభుత్వం జైల్లో పెట్టింది. అపుడు వారి కూతురు సుమన్ శాస్త్రి కి తీవ్రమైన జబ్బుచేసింది. ఆంగ్ల ప్రభుత్వం శాస్త్రి గారికి 15 రోజుల parole ఇచ్చింది. [ Parole- a temporary or permanent release of a prisoner before the expiry of a sentence on a promise of good behaviour] కానీ ఆ parole ముగియకముందే శాస్త్రి గారు జైలుకు వాపసు వచ్చారు. అలా ఎందుకు వచ్చేసారు ? అని జైలు అధికారులు అడిగితే '' ప్రభుత్వం నా కూతురును చూసుకొమ్మని నాకు ఈ పెరోల్ ఇచ్చింది. కానీ ఇపుడు ఆమె మరణించింది. ఇక నేను ఎవరిని చూసుకోవాలి ? కాబట్టి నేను వాపసు వచ్చేసాను. నేను పెరోల్ నిబంధనలను గౌరవించాలి కదా ''
Lal-Bahadur-Shastri-Jayanthi-wishes-images-greetings-in-telugu-language-free-download
మరొక సంఘటన : శాస్త్రిగారి భార్య శ్రీమతి లలితా శాస్త్రి గారికి Servants of People's Society అనే సంస్థ నుండి నెలకు 50 రూపాయల పించను వస్తుండేదట. ఒక మారు శాస్త్రిగారు తన భార్యను '' నెలకు మనకు ఎంత ఖర్చు అవుతున్నది ?' అని అడిగితే ఆమె ' 10 రూపాయలు ' అని చెప్పారట. వెంటనే శాస్త్రిగారు Servants of People's Society ని స్థాపించిన శ్రీ లాలా లజ్ పత్ రాయ్ గారికి ఉత్తరం వ్రాస్తూ '' మాకు నెలకు 10 రూ. సరిపోతున్నది. మిగిలిన 40 రూ. ను మరో నలుగురు పేదలకు ఇవ్వవచ్చు కదా , అందుకే వచ్చె నెలనుండీ మాకు కేవలం 10 రూ. మాత్రమే పంపండి '' అన్నారు.

ఇంకొక సంఘటన : శాస్త్రి గారు ఒక కారు కొనాలని మిత్రులు , బంధువులు , అభిమానులు ఒత్తిడి చేసి ఒక ఆకుపచ్చ రంగు Fiat కారును ఎంపిక చేసారు. అపుడు దాని ఖరీదు రూ. 12000. కానీ శాస్త్రి గారి దగ్గర కేవలం రూ. 7000 మాత్రమే వుందట. అపుడు మిగిలిన రూ. 5000 ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అప్పు తీసుకొని కారును కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా , తరువాత కేంద్ర మంత్రిగా , ఆ తరువాత సాక్షాత్తూ దేశప్రధానిగా పని చేసినా వారి బ్యాంక్ అకౌంట్ లో వుండింది కేవలం ఏడువేలు మాత్రమే. వారు 1966 లో తాష్కెంట్ [ రష్యా ] లో ' మరణించారు ' [ లేదు , చంపబడ్డారు] . ఆ తరువాత రోజుల్లో '' మీరు బ్యాంక్ కు బాకీ వున్న రూ. 5000 ను చెల్లించాల్సిన పని లేదు '' అని బ్యాంకు అధికారులు స్వయంగా వచ్చిచెప్పినా శ్రీమతి లలితా శాస్త్రి ఒప్పుకోలేదు. కొంత గడువు అడిగి తీసుకొని మొత్తం అప్పును వారు తీర్చేసారు.

చివరగా - జనవరి 11 , 1966 న శాస్త్రిగారి శవాన్ని తీసుకొని రష్యానుండి విమానం , దిల్లీ లోని పాలం విమానాశ్రాయనికి వచ్చినపుడు , అందులోనుండి దిగిన అప్పటి కమ్య్యునిస్టుపార్టీ అధికారులను , ఇందిరాగాంధీ ' చిరునవ్వుతో ' స్వాగతించిన సంగతి దేశభక్తులు ఎన్నటికీ మరచిపోరాదు !
Lal Bahadur Shastri Jayanthi greetings wishes images in telugu pdf free download, Freedom fighter Shri Lal Bahadur Shastri Jayanthi greetings wishes images wallpapers messages in telugu language telugu font.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only