నీ ముందు ఏముంది..? నీ వెనుక ఏముంది.. అనేది అనవసరం.. నీలో ఏముందనేదే నీకు ముఖ్యం.
ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు.. కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది.
ప్రతిరోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు.. కానీ మీ క్యారెక్టర్ ను కోల్పోతే మాత్రం అంతా కోల్పోయినట్టే.
మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా.. మన కర్తవ్యం మనకు గుర్తుండాలి. అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి.
మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం.. ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయమనేది అంతం కాదు.. ఓటమి అనేది చివరి మెట్టు కాదు..
పాజిటివ్ మైండ్ తో ఉండటం.. అలసటను ఆనందంగా స్వీకరించడం.. ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు.
ఓ యువతా మేలుకో.. నిద్ర నుండి మేల్కొని, గమ్యం చేరే వరకు విశ్రమించకండి.
నిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం వరిస్తుంది. నెమ్మదిగా అయినా సరే, మనం జయించి తీరుతాం. అదే విజయ రహస్యమంటే..
లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి, లక్ష్యసాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యమంటే..
మహత్తర కార్యాలు ఏ విషయంలో అయినా ఆత్మవిశ్వాసం ఉంటే.. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.
ప్రేమే జీవితం వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.
మనం ఎప్పుడూ బలంగా.. ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం ఎప్పుడూ బలంగా మార్చుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం.
అనంతమైన సహనాన్ని.. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి.. విజయం మీ వెంటే ఉంటుంది.
ప్రజల్లో మేల్కొలుపు.. మహిళా సాధికారత, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది.
ఎవరికి వారు క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్ట్ కాలేడు. అలాగే హిందువు, బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.
Tags:
Swamy Vivekananda Quotes in Telugu
Best Inspirational Quotes From Swamy Vivekananda
స్వామి వివేకానంద సూక్తులు
తెలుగు మంచి మాటలు
మంచి సూక్తులు
సుభాషితాలు
Post a Comment