Wednesday 23 June 2021

Mabharat story - Tales from Mahabharat - Kanika neeti - మహాభారతంలోని కథలు - కణికనీతి

మహాభారతంలోని కథలు - కణికనీతి

కణికనీతితో కార్యాలు సాధించాలి.

( ఈ కథ ఆదిపర్వం లోనిది )

హస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులున్నారు.

అందులో ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మ పరుడు, నీతికోవిదుడు.
రెండవవాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వ హిస్తూ, నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు.
మూడవ వాడు కటికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే

! మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల నీతిపరుడైన కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీరు చదవబోతున్నారు.
మహారాజా !

అనగా అనగా ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో క్రూరమృగాలు, యథేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ ఓ నక్క ఉంది.అది చాలా తెలివైనది. తన పనులన్నీ ఇతరులచేత చేయించుకుని, పని పూర్తికాగానే వాటిని మోసంచేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిస, ఎలుక. వీటితో కలిసి మెలిసి ఉన్నట్టు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది...

ఆరోజులలో ఒకనాడు —

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటబడింది. ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా, దాన్ని పట్టడం సాధ్యం కావడంలేదు. బాగా ఆలోచించింది నక్క,
మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని:

" స్నేహితులారా ! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యంకాదు. ఇప్పుడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు" అని నాలుక చప్పరించి, అది ఎంతరుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరింది.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం" అన్నాయి అవి ఆతు రతతో అటే చూస్తూ.

అది కొంతసేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పుడు ఆలోచన వచ్చింది. "

జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలకబావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అద నులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే అంది.
దానితెలివి అని ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేని, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళుజాపి నిద్రపోతున్నది లేడి. నక్క పలహా ప్రకారం అలికిడి కాకుండా ఎంతవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతూండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతోపాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పుడా నక్క:

"స్నేహితులారాంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందు చేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు" అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.
అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది. పులి, ఆ లేడి మాంసం తినాలని.
నక్క బొటబొటా కన్నీప కారుస్తూంటే చూసిన పులి:
"బావా! ఎందుకు విచారిస్తున్నావు? అంది.
"ఏం చెప్పను పులిబావా | ఆ ఎంక లేదూ! అది ఏమన్నదో
తెలుసా | 'పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం. నేను కాళ్ళు కొరి కితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గులేకుండా,' అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలి గింది, అంటూ నక్క కన్నీరు విడిచింది.
పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలుక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను. అంటూ వెళ్లి పోయింది.
అంతలో ఎలక రాగా -
విన్నావా ఎలకబావా ! ఈ లేడిని పులి ముట్టుకుంది కనక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎంకను తినేస్తా అంటూ ముంగిన బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంత సేపటికి తోడేలు వచ్చింది. "విన్నావా ! పులిబావకు నీ మీద కోపంవచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట", అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పుడు ముంగిస రాగా, చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్ని చంపి దూరంగా పారేశాను. నీకు బలంఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిమ" అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడిమాంసం ఆరగించింది నక్క. విన్నారా! మహారాజా తెలివితో వంచనతో మనకార్యాలు చక్క బెట్టుకోవాలి అన్నాడు కణితుడు. ఇదే కణిక నీతి. 

Tags:

Best moral lessons from Mahabharata,
Mahabharata tales in telugu
Moral stories from Maha bharata in telugu,
Maha bharata tales with moral,
mahabharata neethi kathalu in telugu,
mahabharata stories in telugu pdf,
mahabharatham story in telugu,
మహాభారతం కథ,
mahabharata full story in telugu pdf free download,
mahabharata story in telugu wikipedia,
mahabharata kathalu in telugu pdf,


You may also Read Download Mahabharata all Stories in on pdf: Click here

క్రింద కనపడుతున్నవన్నీ పుస్తకములే... మీకు నచ్చిన పుస్తకములను క్లిక్ చేస్తే... బ్రౌజర్ ఆ పోస్ట్ లోకి తీసుకువెళ్తుంది... ఒకవేళ బ్రౌజర్ ఓపెన్ అయి ఖాళీగా కనపడితే... top right corner లో ఉన్న  3 dots క్లిక్ చేసివచ్చిన ఆప్షన్స్ లో open with browser option ఎంచుకోండి... అప్పుడు మీకు కావలసిన బుక్ లిస్ట్ ఓపెన్ అవుతుంది... అందులో కావలసిన బుక్ సెలెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోండి... 

భగవద్గీత

Post a Comment

Whatsapp Button works on Mobile Device only