Wednesday 2 June 2021

Hanumath Jayanthi wishes images in telugu greetings dates information

హనుమజ్జయంతి - Hanumat Jayanthi Dates

హనుమజ్జయంతి విషయంలో మనవారిలో కొంత అయోమయం ఏర్పడుతోంది... కొంతమంది చైత్ర మాసంలో అనీ... కొంతమంది వైశాఖంలో అనీ అంటున్నారు..... అసలు ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ పోస్ట్ చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.
Hanumath Jayanthi wishes images in telugu greetings dates information
మనకు ఉన్న గ్రంథాలలో పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి.
అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు.
best hanumat jayanti greetings in telugu...
Hanumath Jayanthi wishes images in telugu
అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
ఈ రోజున ఉయ్యూరులోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామికి వైభవంగా వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇంకా హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి.hanumatjayanti todo list
Hanumat Jayanthi greetings in telugu quotes

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం 
దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్ర ప్రభూతాయ 
మంగళం శ్రీ హనూమతే ||

 అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Hanuman Chalisa in telugu - హనుమాన్ చాలీసా 

Hanuman Chalisa in telugu pdf images

👇👇Download Hunuman chalisa in pdf click here👇👇


హనుమాన్ స్తోత్రం - Hanuman Stotram in Telugu


అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం!

దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్!!

సకలగుణనిదానం వానరాణామధీశం!

రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి!!

గోష్పధీకృతవారాశిం మశకీకృత రాక్షసం!

రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం!!


యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్!

తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్!!

భాష్పవారిపరిపూర్ణలోచనమ్!

మారుతిం నమత రాక్షసాంతకమ్!!

Tags:
Hanumat Jayanti wishes images in Telugu,
Hanumat Jayanti information in Telugu,
Hanumat Jayanthi Dates information in telugu,
Hanumat Jayanthi to do list in telugu,
Hanuman Chalisa in telugu pdf free download images
Hanuman Stotram in telugu pdf free donwload images

Hanuman Chalisa video song by Shri S P Bala Subramanyam


Post a Comment

Whatsapp Button works on Mobile Device only