Thursday, 14 October 2021

Happy Dussehra telugu greetings wishes quotes messages durga maa images free download

Happy Dussehra telugu greetings wishes quotes messages durga maa images, telugu vijayadashami greetings wishes, దసరా శుభాకాంక్షలు తెలుగులో, dasara shubhakankshalu telugulo, best dussehra wishes images in telugu, top vijayadashami greetings messages quotes in telugu english hindi tamil bengali kannada, latest dussehra telugu wishes greeting cards online messages free download for facebook whatsapp sharechat trending post share.

దసరా కు ఆ పేరు ఎలా వచ్చింది??

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రాత్రులు ఆది శక్తి అయిన సమగ్ర సుందర స్వరూపం.. శక్తి, ఆనందం, చైతన్యం మూర్తిభవించిన పార్వతీ మాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు విజయం, శుభ ప్రదమైన ఫలితాలను అందించమని ప్రార్థించగలిగే రాత్రులే నవరాత్రులు..

తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందవలసిన అవసరం ఉంది.. అదే విజయదశమి పూజ...
విజయాలకు కారకమైన దశమి విజయదశమి..
ఇలా పది అంటే దశ రాత్రుల పండుగ .. అదే దశరా... దసరా అయింది...
పది తలల రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన రోజు అని అందుకే దస్ హరా.. అని కొందరు అంటారు.
 
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెదియమ్మ దుర్గమా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వపటుత్వ సంపదల్

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాలరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి, .. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైల పుత్రిని గాయత్రీ దేవిగా... చంద్ర ఘంటను అన్నపూర్ణగాను....కూష్మాండను మహాలక్ష్మిగాను, స్కంధమాతను లలితా త్రిపురసుందరిగాను, కాత్యాయని తల్లిని సరస్వతీ మాతగాను, కాలరాత్రి ని దుర్గాదేవిగాను.. మహాగౌరిని మహిశాసుర మర్థిని గాను, సిద్ధి ధాత్రిని రాజరాజేశ్వరీ మాతగాను అలంకరించి అర్చించుకోవడం మనం గమనిస్తున్నాం...
నిజానికి ఆకృతులు, ఆహార్యం, ఆలోచనలు ఆరాధనలు, అర్చనలలో భేదమ్ ఉండవచ్చు కాని పరమేశ్వరీ మాత దుర్గమ్మ తాను ఒక్కతే.. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణా సంస్థితా !! అన్నట్లు అమ్మ సర్వప్రాణి కోటిలో శక్తి రూపమై యుండి వానికి నిత్యం జాగృతం చేస్తోందన్నది ముమ్మాటికి సత్యం..
 
శమీ శమయతే పాపమ్, శమీ శత్రు వినాశనం !
అర్జునస్య ధనుర్థారీ - రామస్య ప్రియదర్శినీ !!
Dussehra Festival name and it's significance, what is the meaning of the festival Dussehra,
Happy dussehra 2021 greetings in telugu, best Dussehra vijayadashami wishes images in telugu, latest telugu dasara festival wishes images in telugu, new dussehra 2021 latest greetings online free download, beautiful dussehra greeting cards flex messages designs png wallpapers.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only