Wednesday 2 December 2020

Best successful life quotes from Chanakya niti Sutra in Telugu

Chanakya niti Sutra: 
చాణక్యుడు... మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్య ప్రధానమంత్రి.... ఇతనికి కౌటిల్యుడు అని విష్ణు గుప్తుడు అని పేర్లు కలవు.... ఇతడు అర్థ శాస్త్రము ను రచించినారు... కౌటిల్యుని అర్థశాస్త్రం చాలా ఫేమస్... ఇప్పటికి కూడా మన ఎకనామిక్స్ లో, రాజనీతి శాస్త్రం లో ఇతను చెప్పిన పాఠాలను ఫాలో అవుతారు అంటే అతిశయోక్తి కాదు... చాణక్యుడు తెలిపిన అనేక నీతి సూత్రాలు మన నిత్య జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది... వాటిని వేరువేరు పోస్టుల ద్వారా మీకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ను మీ ముందు ఉంచుతున్నాము... ఈ పోస్టులో ఒక మనిషి సుఖమయ జీవనానికి కావలసిన అత్యంత విలువైన 3 విషయాల గురించి చర్చించడం జరిగింది... అవి ఏమిటో ఒకసారి చూడండి... ఎవరైతే ఈ మూడు విషయాలను రహస్యంగా ఉంచుతారో వారే నిజమైన తెలివికలవారు. 

1.మీ భార్యను చులకన చేసి మాట్లాడటం 
(husband and wife relationship quotes from Chanakya niti Sutra in Telugu)
Best-successful-life-quotes-from-Chanakya-niti-Sutra-in-Telugu
చాణక్యుని నీతి ప్రకారం నిజమైన తెలివైన వారు తమ భార్య గురించి ఇతరుల ముందు ఎప్పుడూ చులకనగా మాట్లాడరు.అనగా చిన్న చూపు చూడటం,ఇతరుల ముందు గేలి చేసి మాట్లాడటం లాంటివి చేయరు. ముందుగా మీరు మీ భార్యను చులకనగా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని మీరు అగౌరవ పరుచుకున్నట్లే అర్థం.అందుకని ఎప్పుడూ కూడా మీ భార్యను ఇతరుల ముందు గౌరవించి మాట్లాడండి. 

 2.మీకు జరిగిన అవమానాన్ని ఇతరులతో పంచుకోవడం.... 
best real life success and failure quotes from Chanakya niti Sutra in Telugu
చాణక్యుని ప్రకారం నిజమైన తెలివైన వారు ఎప్పుడూ కూడా తమకు జరిగిన అవమానాన్ని ఇతరులతో పంచు కోరు.ఎందుకంటే ఒకవేళ మీరు అలా గనక చేస్తే వారు మీ వెనకాల ఇతరులతో ఇంకా అవమానకరంగా మాట్లాడుతారు.తద్వారా సమాజంలో మీ విలువ, పరువు ప్రతిష్టల కు భంగం కలిగే అవకాశం ఉంది. 

3.మీ ఆర్థిక విషయాలు... 
best life quotes about financial planning from Chanakya niti Sutra in Telugu
చాణక్యుని ప్రకారం నిజమైన తెలివైన వారు ఎప్పుడూ కూడా తమ ఆర్థిక విషయాలు ఎవరితో పంచుకొరు.ఎందుకంటే మీరు ఆర్థికంగా బలంగా ఉంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.అదే మీరు బలహీనంగా ఉంటే మిమ్మల్ని చులకనగా చూడటం మొదలుపెడతారు.కాబట్టి మీ ఆర్థిక లావాదేవీల గురించి ఎవరితో పంచుకోకుండ ఉంటే మంచిది అని చాణక్యుని అభిప్రాయం. ఈ మూడు సూత్రాలు తోనే జీవితం సుఖమయం కాదు ... పాటించవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఇది అందులో ముఖ్యం అని గుర్తుంచుకోండి.. 
For more---click ->>>>Chanakya Quotes quotes in telugu
Tags
best inspirational life quotes in Telugu,
best Telugu life quotes from Chanakya niti Sutra,
Husband and wife relationship quotes in Telugu,
Best life quotes inspirational messages from Chanakya Neeti sutralu in Telugu,
All time best life quotes in Telugu,
Powerful success life quotes in Telugu,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only