Sunday 5 January 2020

mukkoti ekadashi shubhakankshalu telugulO

మన భారతీయ ప్రతి పండుగలో ఒక విశిష్టత ఉంటుంది... 
అలాగే ఈ వైకుంఠ ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది... మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు కాలంతో సమానమని చెప్పారు... అలాగే వారికి ఒక పగలు(ఉత్తరాయణం) మనకు 6 నెలలు... రాత్రి (దక్షిణాయనం)6 నెలలు అన్నమాట... సకల చరాచర సృష్టిలో స్థితి మూలకారణమయిన శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఈ ఏకాదశి తిథినే... ఆయనను వేకువఝాముననే దర్శించుకోవడానికి దేవతలు మూడు వరుసలలో వేచి ఉంటారట...
సంస్కృతంలో కోటి అంటే వరుస... అని సమూహం... అని అర్థం వస్తుంది..
(Ex.మనం ప్రస్తుతం ఉపయోగించే గణితంలో సాంఖ్యక శాస్త్రం(statistics)లో వచ్చే Rank Correlation ను కోటి సహసంబంధ గుణకం అంటారు .. తెలుగు మీడియం వారికి అర్థమవుతుందని ఈ ఉదాహరణ చెప్పాను..).. ఇలా మూడు వరుసలలో ఉండే దేవతలను.. ముక్కోటి దేవతలు అంటారు.. అందరూ అనుకొనేటట్లు.. మూడు కోట్ల దేవతలు ఉంటారు అని కాదు.. ఈ ముక్కోటి దేవతల గురించి ఈ సారి ఎవరైనా మ్లేఛ్ఛులు ప్రశ్నిస్తే ఇప్పుడు సరిగ్గా సమాధానం చెప్పండి..
ఈ మూడు వరుసలలో ఉండే దేవతలు 33 మంది.. కొంత మంది వీరిని 33 కోట్ల దేవతలుగా కూడా చెప్తారు.. వారి వివరాలు ఇవే..
ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.
వారెవరంటే..
అశ్వనీ దేవతలు 2
అష్టవసువులు 8
ద్వాదశాదిత్యులు 12
ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.

అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా,
1.ధరుడు ..
2. ధృవుడు
3.సోముడు
4.అహుడు
5. అనిలుడు
6.అగ్ని
7.ప్రత్యూషుడు
8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.
ఇక
1.శంభుడు
2.పినాకి
3 గిరీషుడు
4.స్థాణువు
5. భర్గుడు
6.శివుడు
7సదాశివుడు
8. హరుడు
9.శర్వుడు
10.కపాలి
11.భవుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.
1.ఆర్యముడు
2. మిత్రుడు
3. వరుణుడు
4.అర్కుడు
5.భగుడు
6. ఇంద్రుడు
7. వివస్వంతుడు
8.పూషుడు
9.పర్జన్యుడు
10. త్వష్ట
11. విష్ణువు
12.అజుడు
.. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు. మిత్రులకు శ్రేయోభిలాశులకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!!
mukkoti ekadashi shubhakankshalu telugulO
mukkoti ekadashi shubhakankshalu telugulO
Tags:
ముక్కోటి ఏకాదశి విశేషాలు, ముక్కోటి దేవతల పేర్లు, వైకుంఠ ఏకాదశి ఏ రోజున వస్తుంది, Names of Mukkoti devathalu , mukkoti ekadashi information in telugu, mukkoti ekadashi greetings in telugu, mukkoti ekadashi gods images messages in telugu,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only