Tuesday, 4 May 2021

Happy mothers day 2021 wishes images in telugu

Happy mothers day 2021 wishes images in telugu,
 
అమ్మ... మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ... పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అని మన అమ్మను మొదటి స్థానంలో ఉంచారు... ఇప్పటికీ అ అంటే అమ్మ అనే తెలుగు అక్షరాల అమరిక మనకు నేర్పుతుంది.. అంతటి స్థానాన్ని మనం తల్లికి ఇచ్చాము... అమ్మ తను బిడ్డని ఇచ్చే ప్రతి సారి పునర్జన్మించినట్లే... అంతటి కష్టాన్ని కూడా పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది.

తమ పిల్లలకు బాధ కలిగిందన్న విషయం అందరి కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.... ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు... అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకవచం. అలాంటి అమ్మలకు మనము ఏమి ఇచ్చుకోగలం..

... రోజూ అమ్మ ఇంట్లోనే ఉంటుంది మనకు... పాశ్చాత్యులకు అలా కాదు.. అసలు అమ్మ ఎన్ని రోజులు వారి దగ్గర ఉంటుందో తెలియదు.. అందుకే ఈ రోజు పని కట్టుకుని గుర్తుపెట్టుకొని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు..
మే నెలలోని రెండవ ఆదివారాన్ని అమ్మల దినోత్సవంగా పాశ్చాత్యులు జరుపుకుంటూ ఉంటారు.. ఇప్పుడు ఆ కల్చర్ మనకు కూడా పాకింది కదా .. పర్లేదు ఈ రోజు అమ్మలను గుర్తు తెచ్చుకుని గ్రీటింగ్స్ పంచుకోడం తప్పేముంది... మీరు కూడా మీ అమ్మకు గ్రీటింగ్స్ పంపండి... ఈ పోస్ట్ ఎన్నో మదర్స్ డే మెసేజ్ లు, గ్రీటింగ్ కార్డులు ... వాట్సప్ స్టేటస్ లు... ఉన్నాయి.. మీ మిత్రులతో పంచుకోండి... 
| best whatsapp messages for mothers day in telugu| 

భగవంతుడేపుడూ నాకు కనపడడు అని బాధ పడ్డా..
కానీ గ్రహించలేకపోయా...

నీ రూపంలో ఎప్పుడూ నా ప్రక్కనే ఉన్నాడని
అమ్మానీకివే నా మాతృదినోత్సవ శుభాకాంక్షలు... !!!

Thank you maa
చూడడానికి అది చిన్న మాటే
కానీ అది మేము నిన్ను ఈ క్షణం
గుర్తు చేసుకోడానికి మాత్రమే
మీ సేవలు వెలకట్టలేనివి... !!!
 
Here is the Mother's Day Telugu greetings images quotes messages for face book friends, best mothers day quotes in telugu, happy mothers day quotes in telugu, mother's day 2021 quotes in telugu,
అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు...
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు...
నాకు మరో జన్మ అంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలని ఉంది అమ్మా..
నీకివే మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
 
Happy mothers day telugu sms messages for best whatsapp sharing quotes images wallpapers free download 

నా రేపటి భవిష్యత్ కై నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ..
అమ్మానీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు...


కనిపించని దేవుడైనా
కనిపెంచిన నీ తర్వాతే అమ్మా...!!
Latest Happy mothers day wishes images in telugu quotes
New mothers day telugu greetings mothers day messages in telugu sms

Post a Comment

Whatsapp Button works on Mobile Device only