Monday 18 July 2022

Happy Rakhi 2022 telugu greetings wishes images free download pdf

Meaning and significance of Raksha Bandhan / Rakhi festival
రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ సూత్రం కట్టడం అని అర్థం. అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడుగేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ఓ సోదరి కట్టే కంకణమే రాఖీ. రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను శ్రావణ పౌర్ణమి ... జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు... ఈ పండుగ శ్రావణమాసము లో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది.. ఈ రోజే అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక రక్షా దారమును కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం...  ప్రతి సోదరి తన సోదరుని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ పండుగ.. 
Jandhyala Pournami information in telugu
సాధారణం జంధ్యాన్ని ధరించే వారు... ఈ రోజునే పాత జంధ్యాన్ని విసర్జించి క్రొత్తది వేసుకునే రోజు కాబట్టి.. ఈ రోజును జంధ్యాల పూర్ణిమ గా కూడా చెప్తారు
The shloka to read while tying Raksha bandhan in telugu 
అమ్మలో సగమై - నా న్నలో సగమై..
అన్నవై..
నన్ను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా..
నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష.

నీ చేతుల్లో పెరిగాను,
నీ వెనుకే తిరిగాను
నువ్వు గారం చేస్తుంటే పసి పాపనవుతా..
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా..
అన్నయ్యా నన్ను దీవించు..
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు..
ప్రియమైన నీ చెల్లెలు.


|Happy Rakhi Purnima wishes images in telugu| 

ఏడిస్తే ఊరడించావ్..
ఆకలేస్తే తినిపించావ్..
నాకు ఆనందం పంచడానికి

అహర్నిశలు శ్రమించావ్..
అన్నయ్యా.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను..
మరు జన్మలోనూ నీ చెల్లినై పుట్టాలని కోరుకుంటూ
రక్షా బంధన్ శుభాకాంక్షలు


Latest Hindu festival raksha bandhan greetings wishes for sister 

 అలసిన వేళ అమ్మవై జోలపాడావ్..
అలిగిన వేళ అలక తీర్చి నాన్నవయ్యావ్..
చిరునవ్వును పంచి.. అనురాగాలకు అర్థం నేర్పి అన్నవయ్యావ్..
నీ చల్లని చూపే నాకు చాలు అన్నయ్యా..
రక్షా బంధన్ శుభాకాంక్షలతో.. నీ చెల్లెలు



Rakshabandhan Greetings wishes images in telugu free download
* అన్నయ్యా.. చిరునవ్వుకు చిరునామావి
మంచి మనసుకు మారురూపానివి
మమతలకు ప్రాకారానివి
ఆప్యాయతలకు నిలువెత్తు రూపానివి
రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ చెల్లెలు..

Raksha Bandhan Rakhi purnima telugu kavithalu
 ప్రియమైన అన్నయ్యా..

తనకన్నా మంచి మనసున్న నిన్ను చూసి
ఆ దేవుడు చిన్నబోయాడు
నీ చెల్లెలుగా మరో అవతారం ఎత్తాలనుకున్నాడు.
మమకారానికి ఆకారమైన అన్నయ్యా..
నీకిదే నా అక్షర పుష్పాంజలి.
ప్రేమతో.. నీ చెల్లెలు.
రాఖీ శుభాకాంక్షలు

మమతల మాగాణీలో పూసిన పువ్వులం

స్నేహానురాగాలు నింపుకొన్న నవ్వులం
అనురాగానికి ప్రతీకలం..
అనుబంధానికి ప్రతిరూపాలయిన అన్నాచెల్లెళ్లం
చెల్లి నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి..
రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ ప్రియమైన అన్నయ్య.

మనసే మధుమాసం మా చెల్లెమ్మ,
ప్రేమే అనురాగం.. చిరునవ్వుల చెల్లెమ్మ,
ఇంటికి అందం ముద్దుల చెల్లెమ్మ,
నా కంటికి బంగారం మా చెల్లెమ్మ..
రక్షా బంధన్ శుభాకాంక్షలు..


చెల్లెలికి అన్నయ్య పంపే సందేశాలు..

నీకెంత వయసొచ్చినా
నా కంటికి చిన్న పిల్లవే..
కొండంత ప్రేమను పంచి
నిండుగా దీవించే బంగారు చెల్లివే..
- రాఖీ పండుగ శుభాకాంక్షలు.


చిన్నారి చెల్లీ..
నన్ను ఆట పట్టించే గడుగ్గాయి..

రాఖీ కట్టి నన్ను మెప్పించే బుజ్జాయి..
నీ అల్లరే నాకు సంతోషం..
నీ నవ్వులే నాకు సంగీతం..
ఎప్పటికీ నవ్వుతూ ఉండు చెల్లాయి..
రక్షా బంధన్ శుభాకాంక్షలతో.. నీ అన్నయ్య.

చెల్లీ..
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
ఇరిగిపోని గంధం, చెరగని గ్రంథం
వసివాడని బంధం, మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.
రక్షాబంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య..
రాఖీ శుభాకాంక్షలు
ఎవరైనా, ఎవరికైనా పంపేలా..

అనుబంధాల హరివిల్లు
ప్రేమాభిమానాల పొదరిల్లు
గిల్లికజ్జాల సరదాలు
తోడు నీడగా సాగిన జీవితాలు
కాలం మారినా.. దూరం పెరిగినా..
చెరగని బంధాలు..
అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు..
కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు.

ఒక్క తల్లి బిడ్డలం కాకపోయినా..
అంత కంటే
ఎక్కువ అనురాగాన్ని పంచిన
ప్రియ సోదరికి
రక్షాబంధన్ శుభాకాంక్షలు..!!

 పోట్లాటలు, అలకలు..
బుజ్జగింపు, ఊరడింపులు..
చిన్ననాటి మధుర స్మృతులను,
తిరిగిరాని ఆ రోజులను
గుర్తు చేసుకుంటూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు


Post a Comment

Whatsapp Button works on Mobile Device only