Sunday, 24 July 2022

Sri Krishnaashtami wishes images information in telugu free download greetings

శ్రీ కృష్ణ జన్మాష్టమి - శ్రీ కృష్ణాష్టమి

శ్రీకృష్ణ భగవానుల వారు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో, జన్మించాడు. అందుకే శ్రావణ బహుళ అష్టమి శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినముగా చేసుకుంటాము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీ కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకుంటారు.. ఇప్పుడిప్పుడే ఈ పండగ ప్రాముఖ్యత పెరుగుతోంది...
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాలలో పల్లెటూరులలో ఇప్పటికీ ఉట్టి కట్టి ఊరిలోని యువకుల మధ్య పోటీ పెడతారు... ఉట్టి కొట్టిన వారిని మొనగాడిలా చూస్తారు... ఇలాంటి చర్యల వలన యువకులలో శక్తి యుక్తులు.. సామర్థ్యం.. శరీర పాటవం మెరుగవుతుంది.. మంచి competetive and group skills మెరుగవుతాయి...
Sri Krishnashtami telugu kavitalu about Lord Krishna
క్షణమైనను చాలు
నీ పాదాల చెంతనుండగా..
నీవు లేని జీవితం వెయ్యేళ్ళైనా దండగ////

ప్రేమను కాస్త అందిస్తే ప్రాణమే ఇస్తాడు...
భక్తి తో నువ్వు పూజిస్తే...
తాను భగవంతుడనని మరచి పోతాడు....
నల్లని రూపమున్నోడు...
మల్లె వంటి తెల్లని మనసున్నోడు..
మధురంగా పిలిస్తే పరవశించి
మనస్సంతా నిండిపోతాడు....


కృష్ణా...
నీటిలో నీవే...
నింగిలో నీవే..
నేలపై నీవే...
నలువైపులా నీవే...
నా ఎద నిండా నీవే...

మిత్రులందరికీ
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!

Post a Comment

Whatsapp Button works on Mobile Device only