Happy Ganesh Chaturthy 2023 greeting wishes images in telugu free download, Latest Ganesh chaturthy wishes greeting cards messages for whatsapp statusవినాయక చవితినాడు చిన్నారులతో పాడించేందుకు - గణపతిని ప్రార్థించే కొన్ని ముఖ్యమైన స్తోత్రములు.. పద్యములు ఇక్కడ ఇస్తున్నాము..
వినాయక చవితినాడు చిన్నారులతో పాడించేందుకు - గణపతిని ప్రార్థించే కొన్ని ముఖ్యమైన స్తోత్రములు.. పద్యములు ఇక్కడ ఇస్తున్నాము..
తెలుగు లో గణేశుడి గురించి ఏదైన పద్యం చెప్పు అంటే చాలా మందికి గుర్తు వచ్చే పద్యం..
ఈ పద్యాన్ని నన్నె చోడుడు రచించారు
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!
అల్లసాని పెద్దన గారు రచించిన ఈ పద్యం:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
దశకుమార చరిత్రలో కేతన గారు వ్రాసిన పద్యం:
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!
కుమారసంభవం లోనిది ఈ పద్యం
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!
రామరాజభూషణుడు / భట్టుమూర్తి వ్రాసిన పద్యం:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!
పోతన వ్రాసిన పద్యం:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!
కవయిత్రి మొల్ల వ్రాసిన పద్యం
చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహ
ు భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు
లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!
- Festival Wishes
- _Republic Day
- _Independence Day
- _Mukkoti Ekadashi
- _Bhogi
- _Sankranthi/Pongal
- _Kanuma
- _Shivaratri
- _Ugadi
- _Gurupurnima
- _Holi
- _Varalakshmi Vratam
- _Bakrid
- _Ramzan
- _Sri Krishnastami
- _Rakshabandhan / Rakhi
- _Vinayaka Chaviti
- _Vijaya Dashami
- _Diwali
- Telugu Quotes
- _Telugu Good morning
- _Telugu Good evening
- _Telugu Inspirational
- _Telugu Love Quotes
- English Quotes
- Hindi Quotes
- Tamil Quotes
Post a Comment