Tuesday, 14 October 2014

ఒక తండ్రి కథ :: Inspirational Life stories in Telugu

రామయ్యకు అరవై సంవత్సరాలు వచ్చాయి... అతని కొడుకు శ్రీకాంత్ మంచి ప్రయోజకుడై మంచి కంపెనీలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు... కానీ తన తండ్రి చాదస్తం ఎక్కువైతోందని రోజూ వాపోతూ ఒక రోజు ఏమైనా సరే అతన్ని వృద్ధప్యాశ్రమంలో చేర్పిద్దామని శ్రీకాంత్ నిర్ణయించుకుని ఆ విషయం తన తండ్రికెలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు... రామయ్యకు తన మనుమడైన అఖిల్ తో మంచి సంబంధం ఉంది... అఖిల్  తన తాతయ్యకు దూరం కావడం ఇష్టం లేదు అందుకే తన తాతయ్యకు ఈ విషయం చెప్పేసాడు.. రామయ్య చాలా బాధపడ్డాడు తన కొడుక్కు తన మీదున్న విసుగుకు ఎలా తీసివేయాలో ఆలోచించసాగాడు... ఒక ఉదయ వేళ తన కొడుకు సోఫాలో కూర్చుని పేపర్ చూసే సమయంలో బాబూ కిటికీలో ఉన్నదేమిటి అని అడిగాడు...
‘అది కాకి నాన్నా!!’ సమాధానమిచ్చాడు.. శ్రీకాంత్
ఇంకొంచెం సేపైన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు రామయ్య..
ఈ సారి శ్రీకాంత్ కొంచెం విసుగ్గా నాన్నా అది కాకి అని చెప్పానుగా.. అన్నాడు...
ఇలా ఒక నాలుగు సార్లు కావాలనే రామయ్య అదే ప్రశ్నను అడిగాడు.. శ్రీకాంత్ కు విసుగు వచ్చి నాన్నా అందుకే నిన్ను వృద్ధాశ్రమంలో వేద్దా మనుకున్నాను... ఎందుకిలా నన్ను విసిగిస్తున్నావని విసుక్కున్నాడు శ్రీకాంత్... దానికి రామయ్య బాబూ నీవు ఈ డైరీ చదువు అని ఒక డైరీ చేతిలో పెడతాడు...
విసుగ్గానే అందుకున్నా... ఆడైరీలోని ఒక పేజీ వైపు శ్రీకాంత్ కళ్ళు పరుగులు తీసాయి...
“‘ ఈ రోజు నా కొడుకు నన్ను ఇరవై సార్లు కాకిని చూపించి ఇది ఏమిటి అని అడిగాడు.. నాకు ప్రతి సారి ఎంతో ముద్దు వచ్చేది వాడిని చూసి.. అందుకే అడిగిన ప్రతిసారి సమాధానమిచ్చాను.. అలా వాడు అడిగే కొద్దీ ఇష్టం పెరుగుతోంది కానీ తగ్గలేదు. ఎందుకో!! అని వ్రాసి ఉంది...
ఒక్కసారిగా శ్రీకాంత్ కళ్లలో గిర్రున నీళ్ళు తిరిగాయి.. తన మీద ప్రేమతో ఇరవైసార్లు తనకు సమాధానమిచ్చిన విషయం తనకు కూడా గుర్తుంది.. కానీ తానేమి చేసాడు.. కేవలం నాలుగు సార్లకే ఎందుకు తనకంత కోపం/విసుగు అనిపించింది.. ఒక్కసారిగా తనమీద తనకే అసహ్యం వేసింది.. బాధతో ప్రేమతో తన తండ్రి కౌగిలించుకుని ..
సారీ!! నాన్నా ఇకపై ఎప్పుడూ ఇలా ప్రవర్తించను.. అని మనస్ఫూర్తిగా మనస్సులో అనుకున్నాడు.. శ్రీకాంత్
మనలో చాలా మంది.. ఈ స్థితిని దాటిన వాళ్ళం ఉండే ఉంటాము. మనకోసం తమ యవ్వనాన్ని.. జీవితాన్ని మనకోసం ధారపోసి... మన భవిష్యత్ నే వాళ్ళ కెరియర్స్ గా మరల్చుకున్న మన తల్లితండ్రుల కోసం ఏంచేస్తున్నాము.. మన తల్లి తండ్రులకు ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకోలేం.. చదువురీత్యానో ఉద్యోగ రీత్యానో తల్లి తండ్రులకు దూరంగా ఉండే వారే ఎక్కువ... అయినా వేర్వేరు పనుల బిజీ లో కొన్ని బంధాలను సరిగ్గా పట్టించుకోలేక పోతున్నాం... మన తల్లితండ్రులకు రెగ్యులర్ గా చేసే చిన్ని ఫోన్ కాల్ చాలు... మనం వారిని ఆనందంగా ఉంచేటందుకు.... ... అందుకే ఈ రోజు మీ తల్లితండ్రులకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు..
వీలైతే మీ తల్లితండ్రులకు ఫోన్ చేయండి.. ప్రేమతో...
Inspirational life stories in telugu

Inspirational life stories in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only